- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభ సభ్యుడిగా వెంకట సత్యనారాయణ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు
ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన భీమవరంకు చెందిన పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన భీమవరంకు చెందిన పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ఆయనతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ప్రయాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
కాగా, పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా భీమవరానికి (Bheemavaram) ప్రాంతానికి చెందిన వెంకట సత్యనారాయణ ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS)లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం (Narasapuram) నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓ వైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే 2018-2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం పాకా వెంటక సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.






