Venkaiah Naidu: ప్రస్తుత ప్రభుత్వం వారికి అన్నీ అవకాశాలు కల్పిస్తోంది..

by Ramesh Goud |

ప్రస్తుత ప్రభుత్వం ఎస్టీలకు అన్ని అవకాశాలు కల్పిస్తోందని, వీటిని ఆసరాగా చేసుకొని ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు.

Venkaiah Naidu: ప్రస్తుత ప్రభుత్వం వారికి అన్నీ అవకాశాలు  కల్పిస్తోంది..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ప్రభుత్వం ఎస్టీలకు అన్ని అవకాశాలు కల్పిస్తోందని, వీటిని ఆసరాగా చేసుకొని ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో(Thummala Palli Kala Kshethram) ఏర్పాటు చేసిన గిరిజన - ఆదివాసి సమ్మేళనం కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సోదరులందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

గిరిజన- ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే లక్ష్యంతో, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ కి, ఇతర నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే గిరిజనులు, ఆదివాసీలు అంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని, తాము జీవించటంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనదని కీర్తించారు. అంతేగాక ప్రస్తుతం ప్రభుత్వం ఎస్‌టీ వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోందని, వీటిని గిరిజన సోదరులు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని కోరుకున్నారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి సూచించారు.

Next Story