- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏయూనే నా రాజకీయ పునాది: వెంకయ్యనాయుడు
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన రాజకీయ ప్రస్థానానికి ఈ వర్సిటీయే పునాది అని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu) తన రాజకీయ ప్రస్థానానికి ఈ వర్సిటీయే పునాది అని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు, థీసిస్‌లు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని, అవి పరిశోధనలకు నిలయాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని వెంకయ్యనాయుడు సూచించారు.
ఉజ్వల భవిష్యత్తు కోసం..
విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం క్రమశిక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. కేవలం సర్టిఫికెట్ల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదవాలని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన జీవనశైలితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని విద్యార్థులకు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు.






