Vande Mataram: వికసిత భారత నిర్మాణానికి ప్రేరణగా వందేమాతరం : వెంకయ్యనాయుడు

by Ramesh Naini |

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన "వందేమాతరం" గీతం వెలువడి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి.

Vande Mataram: వికసిత భారత నిర్మాణానికి ప్రేరణగా వందేమాతరం : వెంకయ్యనాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన "వందేమాతరం" (Vande Mataram) గీతం వెలువడి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

‘స్వాతంత్ర్య పోరాట దిశగా నాడు భారత జాతిని జాగృతం చేసిన ఈ గీతం, నేడు వికసిత భారత నిర్మాణం దిశగా యువతను చోదకశక్తులుగా తయారు చేసే స్ఫూర్తిని నింపగలదనే నమ్మకం ఉంది. వందేమాతరం పాడుదాం.. వికసిత భారతాన్ని నిర్మిద్దాం’ అని ఆయన శుక్రవారం ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

కాగా, వందేమాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవాల ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం 9.30కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదుగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వందేమాతరం సంస్కరణోత్సవాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story