- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీటింగ్‌కు పర్మిషన్ తీసుకుని.. స్లీపర్‌గా మార్చి.. ప్రాణాలతో చెలగాటం
కర్నూల్ జిల్లాలో అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు లూప్ హోల్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు లూప్ హోల్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రయాణికుల సేఫ్టీకి తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా బస్సును నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో మరో విషయం బట్టబయలైంది. సీటింగ్ పర్మిషన్ తీసుకున్న బస్సును.. స్లీపర్ గా మార్చి నడిపిస్తున్నట్లు తేలింది. 2018 నుంచి వేమూరి సుబ్బారావు ఈ ట్రావెల్స్ ను నడిపిస్తున్నారు. డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సు.. ఆలిండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశాలోని రాయగడ ఆర్టీఓ ఆఫీసులో ఆల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించుకుంది. రాయగడ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు.
పర్మిషన్ తీసుకున్న దానిప్రకారం.. బస్సును సీటింగ్ కెపాసిటీతో నడిపించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా.. 43 సీట్ల సీటింగ్ బస్సును ఏసీ స్లీపర్ గా మార్చింది కావూరి ట్రావెల్స్. 2018లో తెలంగాణలో బస్సును రిజిస్ట్రేషన్ చేయించిన యజమాని.. 2023లో ఎన్ఓసీతో డయ్యూడామన్ లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని.. స్లీపర్ కోచ్ గా మార్చారు. ఇలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యాజమాన్యం చేసిన తప్పిదానికి నేడు 20 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతై మాంసపు ముద్దలుగా మిగిలాయి. ఈ ఘటనపై కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించకపోవడంతో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.






