- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలోకి మహిళా నేత
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ జంపల్లి సత్యవతి జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) తాడేపల్లిగూడెం(Tadepalligudem) మండలం వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ జంపల్లి సత్యవతి(MPTC Jampalli Satyavati) జనసేన(Janasena) నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ ఇంచార్జి వడ్డి రఘురామ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఎంపీటీసీ సత్యవతి, ఆమె భర్తను పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన సత్యవతి జనసేనలో చేరారు. అయితే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం, వడ్డి రఘురామ్ నాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో మరలా తిరిగి పార్టీలో చేరినట్లు సత్యవతి తెలిపారు. పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజా సమస్యల కోసం, గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. మరలా వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు వడ్డి రఘురామ్ నాయుడు నాయకత్వంలో కృషి చేస్తానని వెల్లడించారు.






