- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీ ట్రాప్ కాదు! జనసేన ఎమ్మెల్యేపై మరో వీడియో విడుదల చేసిన వీణ
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని, ఐదు సార్లు అబార్షన్లు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె మరో వీడియో విడుదల చేశారు. తనను ఎవరో రెచ్చగొట్టి పంపారనే వార్తలపై బాధితురాలు స్పందిస్తూ వీడియో విడుదల చేసింది. తనను ఏ పార్టీ రెచ్చగొట్టి పంపలేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రలోభ పెట్టి నాతో హనీ ట్రాప్ చేయించారని కొందరు ఆరోపించడంలో వాస్తవం లేదని అన్నారు. నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేదు.. అని, నాకు జరిగిన అన్యాయంపై నేను మాట్లాడానని చెప్పుకొచ్చారు.
గతంలో వైసీపీ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన శ్రీధర్ ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు.. కాబట్టి పార్టీ పేరుతో మాట్లాడానని అన్నారు. అంతేకానీ, ఈ అంశంలో పార్టీలకు సంబంధం లేదని వీణ తెలిపారు. అయితే, తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే మోసం చేశారని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టానని స్పష్టం చేశారు.






