- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ హెల్త్ పై ఏపీ మంత్రి హాట్ కామెంట్స్.. అందుకే లండన్ ప్రయాణం అంటూ !
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ( Ys Jagan)... ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ( Vasamsetti Subhash) హాట్ కామెంట్స్ చేశారు. వై

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ( Ys Jagan)... ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ( Vasamsetti Subhash) హాట్ కామెంట్స్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదని... అందుకే లండన్ ( London) వెళ్లి వైద్యం చేయించుకున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ( Ambedkar Konaseema District ) మంత్రి సుభాష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అస్సలు స్వీకరించడం లేదని ఫైర్ అయ్యారు.
విమర్శలను తట్టుకునే శక్తి జగన్ కు లేదన్నారు. రాజకీయ నాయకుడిగా మంచి విమర్శలు చేస్తే కచ్చితంగా స్వీకరించాలని చురకలంటించారు. స్కూల్ పిల్లాడి లాగా అటెండెన్స్ కోసం అసెంబ్లీకి వచ్చారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి పారిపోయాడని సెటైర్లు పేల్చారు. జగన్ మానసిక పరిస్థితి బాగా లేకపోతే... ఏపీ ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని కూడా చురకలు అంటించారు. లండన్ దాకా పోనవసరం లేదని కూడా అన్నారు.
వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియక.. అర్థంపర్థం లేని అభియోగాలు తమపై చేస్తున్నారని ఫైరయ్యారు. మతాలు అలాగే కులాల మధ్య గొడవలు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి వైసిపి నేతలు కుట్రలు పండుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోకిరి సినిమాలో... నటుడు ఆలీ.. అడుక్కున్నట్లు ప్రత్యేక హోదా... కోసం జగన్ భిక్షాటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.






