Varudu Kalyani : కూట‌మి పాల‌న కాదు...క్యాసినో పాల‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-20 12:02:51  IST  )

కూటమినేతలకు ఒక న్యాయం.. వైసీపీ వాళ్లకు మరొక న్యాయమా? అని నిలదీశారు. కూటమి పాలన అంటే క్యాసినో ను పాలనగా మారిపోయిందని ఫైర్ అయ్యారు వరుదు కళ్యాణి.

Varudu Kalyani : కూట‌మి పాల‌న కాదు...క్యాసినో పాల‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చంద్రబాబు నాయుడు కూటమి సర్కారుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, క్యాసినో, రికార్డింగ్‌ డ్యాన్సులకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వేయాలని కూటమి నేతలు పచ్చి బూతులు మాట్లాడారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిపైన మంత్రి అనిత ఎందుకు కేసు పెట్టడం లేదు? నడిరోడ్డుపైన వాళ్లను ఎందుకు నడిపించడం లేదని ప్రశ్నించారు.

హోంమంత్రి అనిత పై వరుదు కళ్యాణి ఫైర్

కూటమినేతలకు ఒక న్యాయం.. వైసీపీ వాళ్లకు మరొక న్యాయమా? అని నిలదీశారు. కూటమి పాలన అంటే క్యాసినో ను పాలనగా మారిపోయిందని ఫైర్ అయ్యారు. రికార్డింగ్ డాన్సులకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని నిప్పులు జరిగారు. క్యాసినోకు ఏపీని అడ్రస్ గా మార్చేశారని కూటమి నేతలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కళ్యాణి. మేక, కేక్ కట్ చేస్తే కేసు పెడతారు.. మనిషి పీక కోసినా, మహిళల బట్టలు విప్పి డాన్స్ చేయమన్నా ఒక్క‌ కేసు పెట్టలేదని ఫైర్ అయ్యారు. దీనిపై హోంమంత్రి అనిత స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు వరుదు కళ్యాణి. టీడీపీ పార్టీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైందని కౌంటర్ ఇచ్చారు. దీంతో వరుదు కళ్యాణి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Next Story