Varudu Kalyani: సిట్ అంటే చంద్రబాబు ఇన్వేస్టిగేషన్ టీమ్

by velandi.Saikiran |   (  Updated:2025-10-15 15:13:16  IST  )

చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కార్ పై వరుదు కల్యాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిట్ అంటే చంద్రబాబు ఇన్వేస్టిగేషన్ టీమ్ అంటూ ఫైర్

Varudu Kalyani: సిట్ అంటే చంద్రబాబు ఇన్వేస్టిగేషన్ టీమ్
X

దిశ‌, వెబ్ డెస్క్ : చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కార్ పై వరుదు కల్యాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిట్ అంటే చంద్రబాబు ఇన్వేస్టిగేషన్ టీమ్ అంటూ ఫైర్ అయ్యారు వరుదు కల్యాణి. నకిలీ మద్యం స్కాం కేసులో సీబీఐ విచారణ కావాలని మొదటి నుంచి అడుగుతున్నామ‌ని తెలిపారు. నిజం మాట్లాడినందుకే జోగి రమేష్ పై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న‌ట్లు ఆగ్ర‌హించారు. ఏ తప్పు చేయకుండానే జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారా..? అని నిల‌దీశారు.

తనపై వస్తున్న ఫేక్ వార్తలపై అటు జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. బుధవారం రోజున ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ, తనపై కూటమి అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనార్ధన్ తో బలవంతంగా తన పేరు చెప్పించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. తాను లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా సిద్ధంగా ఉన్నానని, తాను సవాలు చేసిన ఎవరు ముందుకు రావడంలేదని నిప్పులు చెరిగారు.

Next Story