- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vamsi: నేటితో ముగియనున్న వంశీ పోలీసు కస్టడీ.. నెక్ట్స్ఏంటి..?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగియనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) పోలీసు కస్టడీ (police custody) ఈ రోజుతో ముగియనుంది. మొదటి రోజు రెండున్నర గంటల పాటు పోలీసులు విచారించగా, నిన్న దాదాపు ఐదుగంటల పాటు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఈ రోజుఉదయం విచారణ కోసం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించారు. అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషనకు తరలించారు. కాగా ఈ రోజు ఆయన కస్టడీ ముగియనుంది. పోలీసులు మరికొద్ది రోజులు కస్టడీకి కోరాతారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. కాగా వంశీ బెయిలు పిటిషన్‌ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం వంశీ అరాచకాలపై సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీంతో బాధితులు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు భయపడి వెనుకాడిన వారు ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు గన్నవరం(gannavaram) నియోజకవర్గంలో ఆయనపై వరుసా మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇంకో కేసు నమోదు అయింది. గన్నవరం శివారు మర్లపాలెంలో 18 ఎకరాల చెరువులోని కొంత భాగాన్ని గ్రామస్థులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. గతంలో వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని పేరును చేర్చి కేసు నమోదు చేశారు.






