వంశీ చేసేది .. ఓన్లీ వాట్సప్ కాల్స్?

by Thanuru Gopichand |

వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

వంశీ చేసేది .. ఓన్లీ వాట్సప్ కాల్స్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. వంశీ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతనిని హైదరాబాదులో అరెస్టు చేసే సమయంలో అతను సెల్ఫోన్ దొరకలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వంశీ తరచుగా మామూలు కాల్స్ లో కాకుండా వాట్స్అప్ లో కాల్ చేస్తుంటాడని సమాచారం. దీంతో ఆయన ఫోన్ దొరికితే మరిన్ని విషయాలు లభ్యమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫోన్ కు సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు. దీంతో సెల్ఫోన్ కోసం హైదరాబాదు, విజయవాడలో పోలీసులు సోదరులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఉన్న రెండు నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. రాయదుర్గంలోని వంశీ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీ సెల్​ఫోన్​ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటీషన్​వేశారు. కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్​లోనూ వంశీ సెల్​ఫోన్​ అంశాన్ని ప్రస్తావించారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story