- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంశీకి కేసుల ఉచ్చు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో సంచల విషయాలు వెలుగు చూశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో సంచల విషయాలు వెలుగు చూశాయి. ఆయనకు ఇప్పటికే నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు డిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీటితోపాటు వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు సిద్ధంగా ఉన్నాయి. 2019 ఎన్నికలు సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు ఫిర్యాదు ఉంది. అప్పట్లో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. దీనిపై అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ కేసు రీ ఓపెన్ చేయాలని పిటిషన్ వేశారు. యార్లగడ్డ పిటిషన్‌తో కేసులపై పునర్విచారణ మొదలైంది. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వీటిపై విచారణ చేస్తోంది. రూ.210 కోట్లు వరకు మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది.
నిన్న రాత్రి వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వారిద్దరితోపాటు వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు






