- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన వల్లభనేని వంశీ
కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన ఇద్దరు వైసీపీ (YCP) నాయకులపై దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన ఇద్దరు వైసీపీ (YCP) నాయకులపై దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) వారిని పరామర్శించారు. దాడిలో గాయపడిన వైసీపీ నాయకులు కంభంపాటి శ్రీధర్, కంభంపాటి రామ్మోహన్ రావులు పిన్నమనేని హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్నారు. అక్కడకు వెళ్లి వల్లభనేని వంశీ వారితోపాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్య సిబ్బందిని అడిగి గాయపడిన కంభంపాటి శ్రీధర్, కంభంపాటి రామ్మోహన్ రావుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. వైసీపీ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని హామీనిచ్చారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని.. ప్రజాస్వామ్య పంథాలో ధీటైన జవాబు ఇవ్వాలని సూచించారు. గాయపడిన వైసీపీ నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అయితే గన్నవరం మండలంలోని మర్లపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ఆదివారం పర్యటించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను కంభంపాటి రామ్మోహన్ రావు, కంభంపాటి శ్రీధర్ లు కలిశారు. ఈ విషయమై గ్రామంలోని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరో వర్గం వారు ఆగ్రహంతో ఇద్దరిపైన దాడి చేశారు. ఈ దాడిలో రామ్మోహన్ రావు, శ్రీధర్ లకు గాయాలయ్యాయి. తలకు, చేతికి గాయాలు కావడంతో వారిని కుటుంబ సభ్యులు పిన్నమనేని హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ దాడిని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.






