- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
by Naga Rani Yarlagadda |
విజయవాడ జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నిన్న (సోమవారం) వంశీకి న్యూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలతో 2019 అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు ఇప్పటి వరకూ ఆయనపై నమోదైన భూకబ్జా, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాసేపటి క్రితం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు నుంచి విడుదలై బయటకువచ్చారు.
Next Story






