- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వల్లభనేని వంశీకి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు.. టెన్షన్ లో వైసీపీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వైసిపి నేత వల్లభనేని

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ( YCP) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamshi ) ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వైసిపి నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ సబ్ జైలు ( vijayayawada sub jail) అధికారులు... వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపటి క్రితమే వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు.
గత కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ అలాగే కాళ్లు వాయడంతో... చాలా ఇబ్బంది పడుతున్నారు వల్లభనేని వంశీ. అయితే ఆ సమస్య ఇవాళ తీవ్రతరం కావడంతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు.... వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా... దాదాపు రెండు నెలలకు పైగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు వల్లభనేని వంశీ. సత్య వర్ధన్ అనే వ్యక్తిని భయపెట్టడం అలాగే కిడ్నాప్ చేసిన కేసులో... అడ్డంగా బుక్ అయ్యారు వల్లభనేని వంశీ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉంటున్న వల్లభనేని వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అప్పటి నుంచి వరుసగా వల్లభనేని వంశీ పై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయనకు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.






