మళ్లీ అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

by velandi.Saikiran |

వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) మరోసారి ఊహించని పరిణామం ఎదురయింది. జైలు నుంచి

మళ్లీ అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) మరోసారి ఊహించని పరిణామం ఎదురయింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని తెలుస్తోంది. ఇవాళ ఉదయం మరోసారి వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి కూడా వల్లభనేని వంశీ ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించినట్లు సమాచారం అందుతుంది.

ప్రస్తుతం ఆ ప్రైవేట్ ఆస్పత్రిలోనే వల్లభనేని వంశీ చికిత్స పొందుతున్నారని సమాచారం. దాదాపు 137 రోజుల పాటు వల్లభనేని వంశీ జైలు జీవితం అనుభవించిన సంగతి తెలిసిందే. రకరకాల కేసుల నేపథ్యంలో ఆయన జైలు పాలయ్యారు. అయితే తాజాగా అన్ని కేసుల్లో కూడా బెయిల్ సంపాదించిన... వల్లభనేని వంశీ... ఇంటికి వచ్చారు. ఇక ఇప్పుడు... ఇంటి దగ్గర కూడా వల్లభనేని వంశీ ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. తాజాగా ఆయన ఆసుపత్రి పాలు కావడంతో... వైసిపి శిబిరం కలవర పడుతోంది.

Next Story