బిగ్ రిలీఫ్.. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-13 12:29:27  IST  )

వైసీపీ(YCP) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి భారీ ఊరట లభించింది.

బిగ్ రిలీఫ్.. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి భారీ ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు(Satyavardhan Kidnapping Case)లో ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం ఆయన బెయిల్ మంజూరు చేసింది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు. ఈరోజుతో రిమాండ్ ముగియ‌డ‌ంతో పోలీసులు ఆయ‌న్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. వంశీకి బెయిల్ మంజూరు చేసింది.

ఇక‌, ఇదే కేసులో వంశీతో సహా మిగిలిన న‌లుగురు నిందితులు గంటా వీర్రాజు, శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, నిమ్మ చ‌ల‌ప‌తి, వేల్పూర్ వంశీబాబుల రిమాండ్ కూడా ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. వారి రిమాండ్‌ను న్యాయ‌స్థానం రేప‌టి వ‌ర‌కు పొడిగించింది.

Next Story