వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

by Vemula.Srinu Prasad |

వ్యక్తిపై హత్యాయత్నం కేసులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది...

వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం(Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Mla Vallabhaneni Vamsi)పై హత్యాయత్నం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు(High Court) ధర్మాసనం.. వంశీని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

కాగా 2024లో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నూతక్కి సునీల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. వల్లభనేని వంశీ ప్రేరణతోనే సునీల్‌పై ఆయన అనుచరులు దాడి చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ1గా వల్లభనేని వంశీని చేర్చారు. ఈ కేసులో అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. తాజా విచారణలో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.

Next Story