వల్లభనేని వంశీకి అస్వస్థత.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-26 05:46:05  IST  )

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

వల్లభనేని వంశీకి అస్వస్థత.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వంశీకి, కంకిపాడు పోలీసుల కస్టడీలో ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించారు.

ఈ క్రమంలో మరోసారి వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వంశీని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు అనంతరం బీపీ, షుగర్‌ లెవెల్స్ సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Next Story