- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో ఇప్పటికే మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, నేటితో రిమాండ్ ముగియడంతో ఆయను జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతో పటమట (Patamata) పోలీసులు వల్లభనేని వంశీని తీసుకెళ్లేందుకు విజయవాడ జిల్లా జైలు (Vijayawada District Jail)కు చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ (Satyavardhan) స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు.






