Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి నిరాశ.. బెయిల్ పై విచారణ వాయిదా

by Naga Rani Yarlagadda |

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల పీటీ వారెంట్ పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి నిరాశ.. బెయిల్ పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) ఈనెల 22కి వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల (Gannavaram Police) పీటీ వారెంట్ (PT Warrant) పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్ (House Motion Petition) దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేయాలని పిటిషన్ ద్వారా కోరగా.. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.

అలాగే బాపులపాడు నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగియగా.. హనుమాన్ జంక్షన్ పోలీసులు (Hanuman Junction Police) మరో రెండ్రోజులు వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ కేసులో తీర్పును భోజన విరామం తర్వాత వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో జరిగిన దాడి కేసులో (Gannavaram TDP Office Attack Case), సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీకి ఇటీవలే బెయిల్ మంజూరైనా.. ఇళ్లపట్టాల కేసులో రిమాండ్ లో ఉన్న కారణంగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది.

Next Story