- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Divvela-DuvvadaValentine's Day: వాలంటైన్ డే వేడుకల్లో దివ్వెల-దువ్వాడలదే హవా!
వాలంటైన్ వీక్ వేడుకల వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ రేపిన లేటు వయసు ఘాటు ప్రేమికులు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC Duvvada Srinivasi), దివ్వెల మాధురి(Divvela Madhuri)లు ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం(Valentine's Day) రోజు కూడా పరస్పరం తమ ప్రేమ వ్యక్తీకరణల(Expressions of love)తో సోషల్ మీడియాను షేక్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వాలంటైన్ వీక్ వేడుకల వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ రేపిన లేటు వయసు ఘాటు ప్రేమికులు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC Duvvada Srinivasi), దివ్వెల మాధురి(Divvela Madhuri)లు ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం(Valentine's Day) రోజు కూడా పరస్పరం తమ ప్రేమ వ్యక్తీకరణల(Expressions of love)తో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఓ చానల్ ఇంటర్వ్యూ వీడియోలో శ్రీనివాస్, మాధురి తన రొమాంటిక్ చేష్టలతో రెచ్చిపోయారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ, కిస్‌లు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. పరస్పరం గులాబీలు ఇచ్చుకున్నారు.
వీడియోలో దివ్వెల మాధురితో కలిసి వాలెంటెన్స్ డే మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు దువ్వాడ శ్రీనివాస్. ప్రేమికుల ప్రేమానుబంధంపై దువ్వాడ మాట్లాడుతూ ప్రేమికుల మధ్య గాఢమైన ప్రేమతత్వం ఉంటే ప్రతి సమస్యను పరిష్కరించుకుని ముందుకెళ్లవచ్చన్నారు. ఈర్ష్యా, అసుయా, ఆధిపత్యాలతో వ్యవహరిస్తే ఆ జీవితం సర్వనాశనమవుతోందని అందుకు నేనే ఉదాహారణ అని చెప్పుకొచ్చారు. మాధురి మాట్లాడుతూ భార్య, భర్తలు పరస్పరం అర్ధం చేసుకుంటూ..కష్ట సుఖాలను పంచుకుంటూ..ప్రేమించుకుంటు..పరస్పర నిర్ణయాలు గౌరవించుకుంటు ముందుకెళితే వారి బంధం పటిష్టంగా ఉంటుందన్నారు.
మొత్తానికి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా వాలెంటైన్స్ వీక్ లో రోస్ డే ను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్ డే ను, కిస్ డే, వాలెంటెన్స్ డేను కెమెరా ముందు వేడుకగా చేసుకున్న ముదురు ప్రేమ పక్షులు దివ్వెల, దువ్వాడలు సాగించిన వేడుకల వీడియోలు సోషల్ మీడియాను ఊపేశాయి. గతంలోనే వేరే వారితో పెళ్లయిపోయి..పిల్లలు కూడా ఉన్న దువ్వాడ, దివ్వెలలు చేసుకున్న వాలంటైన్ డే వేడుకలను కొందరు విమర్శిస్తే మరికొందరు వీరి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. యువతరం ప్రేమికుల కంటే కూడా వారిద్ధరి వాలంటైన్ డే వేడుకలే ఇప్పుడు నెట్టింటా వైరల్ గా.. హాట్ టాపిక్ గా మారిపోవడం వారి లవ్ క్రేజ్ కు నిదర్శనమంటున్నారు నెటిజన్లు.






