- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి మచ్చలేని నేత వాజ్ పేయి : మంత్రి నారా లోకేశ్
by Naga Rani Yarlagadda |
అవినీతి మచ్చలేని నేత మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ అని..

X
దిశ, వెబ్‌డెస్క్: అవినీతి మచ్చలేని నేత మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ అని, ఆయనంటే తనకెంతో ప్రత్యేక అభిమానమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విలువల కోసం ప్రధాని పదవిని సైతం వదులుకున్న ఉన్నత వ్యక్తి వాజ్ పేయీ అని కొనియాడారు. సీఎం చంద్రబాబుకి, వాజ్ పేయీకి తండ్రి కొడుకు వంటి అనుబంధం ఉందన్నారు.
వాజ్ పేయీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. తెలుగుజాతి ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి విషయంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు పరుగులు పెడుతోందన్నారు.
Next Story






