తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు

by Muthe.Rajitha |

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది.

తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే వీటిలో మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31 & జనవరి 1) కేవలం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఏడు రోజులు (జనవరి 2 నుంచి 8 వరకు) వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సాధారణ సర్వదర్శనం ఉంటుంది.

ఈ పది రోజులూ ప్రోటోకాల్ VIPలు మినహా అన్ని సాధారణ VIP బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్, SED, ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కాగా గతేడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఐదుగురు మరణించగా.. 45 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఘటన పునరావృత్తం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ.

Next Story