వైకుంఠ ఏకాదశి రద్దీ.. తిరుమల భక్తులకు అత్యవసర ఫోన్ నంబర్లు, సూచనలు విడుదల

by Ramesh Naini |

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది.

వైకుంఠ ఏకాదశి రద్దీ.. తిరుమల భక్తులకు అత్యవసర ఫోన్ నంబర్లు, సూచనలు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. రద్దీ అధికంగా ఉండటంతో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ముఖ్యమైన ఫోన్ నంబర్లను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రధాన సహాయ కేంద్రాలు (24 గంటల సేవలు)

TTD హెల్ప్‌లైన్ (టోల్ ఫ్రీ): 155257

విచారణ కార్యాలయం (Enquiry): 0877-2277777

వైద్య సహాయం..

తిరుమలలో అస్వస్థతకు గురైన భక్తులు వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అశ్విని ఆసుపత్రి (తిరుమల): 0877-2263457 / 2263458

అంబులెన్స్ సేవలు: 0877-2263666 (లేదా నేరుగా 108)

మెయిన్ హాస్పిటల్ (తిరుపతి): 0877-2287777

భద్రత & పోలీస్ సేవలు

దొంగతనాలు, తప్పిపోయిన వారు లేదా ఇతర భద్రతా సమస్యల కోసం కింది నంబర్లను సంప్రదించవచ్చు.

విజిలెన్స్ ఆఫీస్ (TTD Security): 0877-2263333

తిరుమల క్రైమ్ పార్టీ: 0877-2263939

తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 0877-2263833

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: 0877-2263733

ఇతర ముఖ్యమైన సేవలు

కళ్యాణకట్ట (తలనీలాలు): 0877-2263222

అన్నప్రసాదం సెంటర్: 0877-2263555

ముఖ్య సూచనలు..

కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయినట్లయితే వెంటనే సమీపంలోని విజిలెన్స్ ఆఫీస్‌ను సంప్రదించి అనౌన్స్‌మెంట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. తిరుమలలో చాలా చోట్ల ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ సమస్యలు లేదా సర్వర్ అంతరాయాల దృష్ట్యా కొంత నగదు చేతిలో ఉంచుకోవడం మంచిదని సూచించారు.

Next Story