- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల(డిసెంబర్) 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల(డిసెంబర్) 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకి 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానిక కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 25వ తేది ఉదయం 10 నుంచి 27 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ కోరింది.






