- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD: తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా వైకుంఠ దర్శనాలు.. రెండో రోజు స్వామివారిని 70,256 మంది భక్తుల దర్శనం.. రేపటి నుంచి టోకెన్ లోని వారికి దర్శనాలు ప్రారంభం..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు స్వామివారిని మొత్తం 70,256 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 4.79 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేవలం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ, రద్దీని క్రమబద్ధీకరిస్తుంది. ఇక రేపటి నుంచి భక్తులకు మరిన్ని దర్శన సౌకర్యాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.
టోకెన్లు లేని సాధారణ భక్తులను రేపటి నుంచి సర్వదర్శనానికి అనుమతించనున్నారు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో ముందుగా టిక్కెట్లు పొందిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు కూడా రేపటి నుంచి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే నిన్న రాత్రి న్యూయర్ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల కొండపైకి చేరుకొని నూతన సంవత్సరాన్ని శ్రీవారి ఆశిస్సులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమల కొండ గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది.






