ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా వి. విజయ రామరాజు బాధ్యతల స్వీకరణ

by Malleboina Mahesh |

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వి. విజయ రామరాజు ఐఏఎస్. అమరావతి రాయపూడి కార్యాలయంలో పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ.

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా వి. విజయ రామరాజు బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) నూతన కమిషనర్‌గా వి. విజయ రామరాజు (IAS) శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాయపూడిలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ ఐదవ అంతస్తులోని కమిషనర్ ఛాంబర్‌లో ముందుగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ఏ. భార్గవతేజ, ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు మరియు ఇతర ముఖ్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషనర్ విజయ రామరాజు సీఆర్‌డీఏలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులతో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని అమరావతి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story