- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ఇలాకలో ఎన్నికలు.. ప్రత్యర్థులుగా టీడీపీ, జనసేన పోటీ
by Vemula.Srinu Prasad |
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు జరగనున్నాయి..

X
దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి అక్టోబర్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలకు నుంచి వైసీపీ తప్పుకుంది. కానీ టీడీపీ, జనసేన విడివిడిగా పోటీకి దిగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించారు. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తమ అభ్యర్థులను ఖరారు చేసి పోటీకి సిద్ధం చేశారు. మొత్తం 18 మంది నామినేషన్ దాఖలు చేస్తే అందులో ఆరుగురు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు వారికి గుర్తులు కేటాయింపు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన సయోధ్య కుదుర్చుకుని ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తారా లేక ప్రత్యర్థులుగా పోటీకి దిగుతారా అనేది చూడాలి.
Next Story






