రైతులకు అండగా చందబాబు: అకాల వర్షాలపై సీఎం సీరియస్ రివ్యూ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు జరిగిన నష్టంపై ఫోకస్ పెట్టింది...

రైతులకు అండగా చందబాబు: అకాల వర్షాలపై సీఎం సీరియస్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అకాల వర్షం(Rain) బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం(AP Government) అప్రమత్తమైంది. రైతుల(Farmers)కు జరిగిన నష్టంపై ఫోకస్ పెట్టింది. అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) భరోసా ఇచ్చారు.

తక్షణ సాయం అందించండి..

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ అకాల వర్షాలపై అధికారులతో రెండో రోజూ కూడా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని, రైతులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తగిన జాగ్రత్తలు తీసుకోండి

ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నిల్వలు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు, వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు కష్టార్జితం వృధా కాకూడదని, తడిచిన ధాన్యాన్ని సైతం నిబంధనలకు అనుగుణంగా సేకరించేలా చూడాలని, బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story