చెప్పలేని విధంగా నా మనవరాలిని లైంగికంగా వేధించారు

by Ajay Maddhiboyina |

చెప్పలేని విధంగా నా మనవరాలిని లైంగికంగా వేధించారు
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో ఓ ఆకతాయి వేధింపులు భరించలేక బాలిక ప్రాణాలు తీసుకుంది. బాలిక మరణం స్థానికంగా కలకలం రేపుతుంది. శనివారం మధ్యాహ్నం నుంచి తన మనవరాలు మూడీగా ఉందని, మృతురాలి తాతయ్య మాణిక్యాలరావు ఆదివారం తెలిపారు. ఏమయ్యిందని ఎంత అడిగినా సమాధానం చెప్పలేదనీ, సాయంత్రం 4 గంటల సమయంలో నా కుమార్తె, నేను వాకింగ్‌కి వెళ్తుంటే పలకరించిందని ఆయన వివరించారు. అప్పుడు వాళ్ల అమ్మ దగ్గరకు వచ్చి ఐ లవ్‌ యూ మమ్మీ అని రెండుసార్లు మాట్లాడి తల్లిని కౌగిలించుకుందని తెలిపారు. తరువాత అపార్ట్‌మెంట్‌ వాళ్లు ఎవరో చిన్నారి సూసైడ్‌ చేసుకుందని చెప్తే, అక్కడికి వెళ్లి చూస్తే నా మనవరాలు ఉందని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించి మా మనవరాలి బెడ్‌రూమ్‌లో సోదాలు చేసినట్లు తెలిపారు. అక్కడ వారికి సూసైడ్‌ నోట్‌ దొరకిందనీ, మాట్లాడలేని విధంగా వినోద్‌ జైన్‌ నా మనవరాలని చెప్పలేని విధంగా లైంగికంగా వేధించాడు అని మాణిక్యాలరావు బోరుమని విలపించారు. తన మనవరాలిని ఇంత క్షోభకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.



Next Story