రాష్ట్రంలో గ్యాస్ కొరతపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

the panic triggered by the ongoing conflict between Iran

రాష్ట్రంలో గ్యాస్ కొరతపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో నెలకొన్న భయాందోళనలతో వినియోగదారులందరూ బుక్ చేసుకోవడంతో గ్యాస్ సరిపడా సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలకు వద్దకు ప్రజలు భారీ వెళ్తున్నారు. బారులు తీరి, గంటల తరబడి నిలబడి సిలిండర్లు తీసుకెళ్తున్నారు. అయినా గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేని స్పష్టం చేశారు. వినియోగదారులకు సరఫరా స్టాక్ ఉందని తెలిపారు. దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. అలాంటివి నమ్మి ముందుజాగ్రత్తగా గ్యాస్ బుక్ చేస్తున్నారని, దాదాపు 2.4 లక్షల గ్యాస్ బుకింగ్స్‌కు 5 లక్షల బుకింగ్స్ అవుతున్నాయని తెలిపారు.

గ్యాస్ సరఫరా పెంపుపై...

పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరా పెంపుపై కేబినెట్‌లో చర్చించి కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం 10 నుంచి 20 శాతం పెంచిందన్నారు. అలానే రెస్టారెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో సరఫరా మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Next Story