స్టీల్ ప్లాంట్ గమ్యమెటు.. ఢిల్లీ పెద్దల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

by Vemula.Srinu Prasad |

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖపట్నం చేరుకున్నారు...

స్టీల్ ప్లాంట్ గమ్యమెటు.. ఢిల్లీ పెద్దల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖపట్నం చేరుకున్నారు. వీరికి ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మంత్రులు సోమవారం ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. ప్లాంట్ పని తీరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీ అమలు చేసిన తీరును సైతం పరిశీలించనున్నారు.

'ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్' (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన

అనంతరం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక 'ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్' (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఈ మెగా ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. సుమారు రూ. 1.40 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామిక రూపురేఖలు మారడమే కాకుండా, దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పర్యటన విశాఖ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.

Next Story