ఏపీలో గూగుల్ పెట్టుబడులకు కారణం ఆయనే: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయమని పుట్టపర్తిలో ‘కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు...

ఏపీలో గూగుల్ పెట్టుబడులకు కారణం ఆయనే: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వె‌బ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రక్షణ రంగ(Defense Sector) చరిత్రలో సరికొత్త అధ్యాయమని పుట్టపర్తి(Puttaparthy)లో ‘కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ ప్రాజెక్టు(Combat Aircraft Project)కు సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీ రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడిందని ఆయన కొనియాడారు. దేశ రక్షణ రంగానికి, ఏపీ ప్రగతికి ఇదొక చరిత్రాత్మకమైన రోజని, భవిష్యత్తుకు ఒక బలమైన మైలురాయిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతకు, సేవకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుట్టపర్తిలో.. ఇప్పుడు ఈ భారీ రక్షణ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుపై ప్రశంసలు

ఇక ఇదే వేదికపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పారిశ్రామిక విజన్, నాయకత్వ పటిమపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు వంటి దూరదృష్టి, నిబద్ధత కలిగిన నాయకుడిని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి శాస్త్రీయ దృక్పథం ఉన్న నాయకుడి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు గతంలో చేసిన కృషిని, పారిశ్రామిక నైపుణ్యాన్ని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే గుర్తించాయని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి చొరవ, బ్రాండ్ ఇమేజ్ వల్లే ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' సంస్థ(Google Project) ఆంధ్రప్రదేశ్‌లో రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టుల రాకతో రాబోయే రోజుల్లో ఏపీ అంటే 'ఆంధ్రప్రదేశ్' మాత్రమే కాదని.. అది 'అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్'గా ప్రపంచ పటంలో నిలవబోతోందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ వెల్లడించారు.

Next Story