పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ పెట్టండి.. స్పీకర్ కు కేంద్రమంత్రి వినతి

by Ramesh Goud |

అరకు కాఫీ ప్రచారం (Araku Coffee Promotion)పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Ohm Birla)కు కీలక విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ పెట్టండి.. స్పీకర్ కు కేంద్రమంత్రి వినతి
X

దిశ, వెబ్ డెస్క్: అరకు కాఫీ ప్రచారం (Araku Coffee Promotion)పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Ohm Birla)కు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు (Parliament)లో శాశ్వత అరకు కాఫీ స్టాల్ (Araku Coffe Stall) ఏర్పాటు చేయాలని స్పీకర్ కు లేఖ (Letter) రాశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా సుముఖత వ్యక్తం చేశారని కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో.. ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప గిరిజన వారసత్వం, సేంద్రీయ వ్యవసాయంకు చిహ్నంగా మన అరకు కాఫీ ఉన్నదని తెలిపారు.

అలాగే స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) మన కి బాత్ (Man Ki Bath) సహా పలు ముఖ్య సందర్భాలలో మన అరకు కాఫీ యొక్క విశిష్టతను పొగిడారని గుర్తు చేశారు. అటువంటి అరకు కాఫీని ప్రోత్సహించడానికి నేడు లోక సభ స్పీకర్ ఓం బిర్లాని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Sri Krishnadeva Rayalu), సీఎం రమేష్ (CM Ramesh) తో కలిసి భేటీ కావడం జరిగిందని అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ ప్రచారం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడంతో పాటు అరకు కాఫీ కోసం శాశ్వతంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

అలాగే తోటి పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులను ఈ కాఫీ యొక్క ప్రత్యేకమైన రుచులకు దగ్గరగా తీసుకురావాలని మా ప్రయత్నం అని వివరించారు. ఇక ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించి, ప్రత్యేక చొరవతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలోనే ప్రారంభించేలా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నాయకత్వంలో, తాము గిరిజనుల అభివృద్ధికి, అరకు కాఫీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని కేంద్రమంత్రి రాసుకొచ్చారు.

Next Story