డబుల్ ఇంజిన్ సర్కార్ శక్తి.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ శక్తి.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ అసాధారణ విజయానికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి అభినందనలు తెలిపారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ శక్తిని ప్రతిబింబిస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శనం, కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్లే రాష్ట్రం పెట్టుబడిదారుల తొలి ఎంపికగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

దూరదృష్టితో కూడిన నాయకత్వం, సంస్కరణలకు అనుకూలమైన విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వేదికపై దూసుకెళ్తోందని తెలిపారు. సుస్థిర అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రతీకగా సన్‌రైజ్ రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story