- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం!
టీడీపీ యువనేత..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) సొంత పార్టీ(TDP) ఆగ్రహానికి గురై సోషల్ మీడియాలో ట్రోలింగ్(Trolling)ఎదుర్కోంటున్నారు. అయితే ఎంపీగానో లేక కేంద్ర మంత్రిగా పనితీరు వల్లనో కాకుండా రథసప్తమి రోజున అరసవల్లి సూర్య దేవాలయం దర్శనానికి సింగర్ మంగ్లీ(Singer Mangli To Visit Arasavalli Sun Temple)ని తీసుకెళ్లడంపై ట్రోలింగ్ ఎదుర్కోంటుండటం ఆసక్తికరంగా మారింది

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ యువనేత..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) సొంత పార్టీ(TDP) ఆగ్రహానికి గురై సోషల్ మీడియాలో ట్రోలింగ్(Trolling)ఎదుర్కోంటున్నారు. అయితే ఎంపీగానో లేక కేంద్ర మంత్రిగా పనితీరు వల్లనో కాకుండా రథసప్తమి రోజున అరసవల్లి సూర్య దేవాలయం దర్శనానికి సింగర్ మంగ్లీ(Singer Mangli To Visit Arasavalli Sun Temple)ని తీసుకెళ్లడంపై ట్రోలింగ్ ఎదుర్కోంటుండటం ఆసక్తికరంగా మారింది. సింగర్ మంగ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేశారని..ఎన్నికల ప్రచారంలో టీడీపీ పాటలు పాడమంటే పాడలేదని అలాంటి మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శనానికి ఎలా తీసుకెళ్తారంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ ఇప్పుడు మీకు వీఐపీ అయిపోయిందని.. పార్టీ కోసం 40 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలు మీకు వీఐపీలు కాలేకపోయారంటూ కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై అసహనం వెళ్లగక్కుతున్నారు. కాగా రథ సప్తమి రోజున అరసవిల్లి సూర్యదేవాలయానికి వచ్చిన సింగర్ మంగ్లీని రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో పాటు వెంట తీసుకెళ్లి దర్శనం చేయించడం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేపోతున్నారు.
కాగా అరసవిల్లి సూర్యనారాయణుని దర్శనం చేసుకున్న సింగర్ మంగ్లీ భావోద్వేగానికి గురయ్యారు. తనకు మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందంటూ మంగ్లీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడిపై అన్నమయ్య రాసిన కీర్తనను మంగ్లీ ఆలపించారు. అరసవెల్లి సూర్యనారాయణుని దర్శనం చేసుకున్నానని, ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ.. తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్న తనకు చెప్పినట్టు శ్రీకాకుళం పుణ్యభూమి అని కొనియాడారు. ఈ వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే సిక్కోలులో పుడతాను తెలంగాణకు చెందిన మంగ్లీ భావోద్వేగానికి గురవ్వడం రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది.






