- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఘనత గడ్కరీకే చెందుతుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం అండగా నిలుస్తోందని, విశాఖ రైల్వే జోన్ (Vizag Railway Zone) అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు. శనివారం మంగళగిరి (Mangalagiri)లో వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చిందని, అదే రోజు ఎంతో విలువైన రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఆనందదాయకమన్నారు. రాష్ట్రానికి నేడు ఎంతో శుభదినమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దాదాపు రూ.5 వేలకోట్ల విలువైన జాతీయ రహదారుల పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇతర కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi), సీఎం చంద్రబాబు (CM Chandrababu), పవన్ కల్యాణ్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. దేశంలో రోజుకు సగటున 30 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తున్న ఘనత గడ్కరీకు చెందుతుందన్నారు. రోడ్డుబడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కూడా ఆయనదేనన్నారు.
పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం అండగా నిలుస్తోందని, విశాఖ రైల్వే జోన్ (Vizag Railway Zone) అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు. గతంలో సాధించలేని అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయని ప్రజలు చింతించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు విషయంలో జాగ్రత్త అవసరం ఉందని, అభివృద్ధిని నెరవేర్చే నాయకులను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటి, అవి పెద్ద చెట్లుగా పెరిగిన తరువాత వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 రోడ్ల ప్రాజెక్టులు ప్రారంభించామని, అవన్నీ నిర్ణీత సమయంలో పూర్తవుతాయన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన "పీ-4" మోడల్‌కు కేంద్రంలో కూడా ఆదరణ ఉందన్నారు. పీ-4 అంటే పాజిటివ్, ప్రోయాక్టివ్, ప్రాక్టికల్, పీస్‌ఫుల్. ఇదే మోడల్‌కు గడ్కరీ మంచి ఉదాహరణ అని అభివర్ణించారు. తాను గత పదేళ్లుగా గడ్కరీ పనిచేసే విధానాన్ని గమనిస్తూ వచ్చానని, ఆయన చొరవతో దేశ విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 162కు పెరిగిందని పేర్కొన్నారు.






