చావు దెబ్బ కొట్టినా బుద్ధి రాలేదు: వైసీపీ నేతలపై కేంద్రమంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-05 10:42:01  IST  )

చావు దెబ్బ కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు..

చావు దెబ్బ కొట్టినా బుద్ధి రాలేదు: వైసీపీ నేతలపై కేంద్రమంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో వైసీపీ(Ycp)ని ప్రజలు చావు దెబ్బ కొట్టారని,. అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Ministor Rammohan Naidu) అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని రామ్మోహన్ నాయుడు సంచలన జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ(Pm Modi), సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) కాంబినేషన్‌లో రాష్ట్రానికి బ్రాండ్ క్రియేట్ చేశారని తెలిపారు. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీయాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.


అంతకుముందు శ్రీకాకుళంలో 4 లక్షల మొక్కలు నాటి పచ్చతొరణానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఇది ఒకరోజు కార్యక్రమం కాదు. ఇక నుంచి ముడుపులు లేవు. వారానికి 1 లక్ష మొక్కలు చొప్పున రాబోయే 25 వారాల్లో 25 లక్షల మొక్కలు నాటి 2025 ను గ్రీన్ రేవల్యూషన్ సంవత్సరంగా చేస్తాం. ప్రధాని మోదీ ప్రేరణతో, చంద్రబాబు స్పూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ప్రతీ ఒక్కరు తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలి. పుట్టినరోజులు, వేడుకల సందర్భాల్లో సైతం మొక్కలు నాటడం అలవాటుగా చేసుకుని ప్రకృతిని కాపాడాలి. గతంలో ఇళ్లలో పెంచే పోషక విలువలున్న మొక్కలు నేడు కనిపించడంలేదు. తిరిగి ఇళ్లలో వాటిని నాటాలి. మొక్కల నాటే కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొని ప్రకృతిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో గార్డెన్ ఉంటే అటువంటి వారికి ఐదు మొక్కలతో పాటు కుండీలు ఇస్తాం. ఉసిరి, నిమ్మ, జామ, మునగ, బొప్పాయ చెట్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. మొక్కలను మనం కాపాడతే అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story