మళ్లీ చెరిగిపోకుండా కాపాడుకోవాలి: అలయన్స్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కూటమి వేసిన పునాదులు చెరిగిపోకుండా 20 ఏళ్లు కాపాడుకోవాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు....

మళ్లీ చెరిగిపోకుండా కాపాడుకోవాలి: అలయన్స్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrabau), డిప్యూటీ సీఎం పవన్(Deputy Cm Pawan Kalyan) వేసిన పునాదులు మళ్లీ చెరిగిపోకుండా 20 ఏళ్లు కాపాడుకోవాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర(Atal Modi Suparipalana Yatra) సభలో ఆయన ప్రసంగించారు. వాజ్ పేయ్ ఇచ్చిన స్పూర్తి తోనే మోడీ నేడు దేశాన్ని అంచలు అంచెలుగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రచంచంలో అనేక దేశాలు తమ అవార్డులను మోడీకి ఇస్తున్నారంటే.. ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలన్నారు.


‘‘ది వాజ్ పేయ్, చంద్రబాబు కలిసి దేశం, రాష్ట్రం అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మా నాన్న ఎర్రంనాయుడు ద్వారా నేను వాజ్ పేయ్‌ను వ్యక్తిగతంగా కలిశాను. ఎర్రంనాయుడు జీవితంలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి యువతను ప్రోత్సహించాలని ఎర్రంనాయుడికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో.. బీసీ నేతగా ఎర్రంనాయుడిని కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రధానిగా వాజ్ పేయ్.. ఎర్రంనాయుడుకి పోన్ చేసి.. సభలో చర్చించే కొన్ని అంశాలపై మాట్లాడేవారు. వికసిత్ భారత్ ద్వారా దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి. అందుకు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లుసిద్దపడ్డారు.’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story