- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సభకు రాలేకపోయా.. చాలా బాధపడ్డా: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలో జరిగిన సభలో పాల్గొనలేక పోయాయని బాధపడ్డానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం(Srikakulam)లో జరిగిన సభలో పాల్గొనలేక పోయాయని బాధపడ్డానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) అన్నారు. భీమవరం(Bhimavaram)లో నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర(Atal Modi Suparipalana Yatra) సభలో ఆయన ప్రసంగించారు. శ్రీకాకుళంలో సభ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఢిల్లీలో ఉండటంతో తానూ అక్కడే ఉన్నానని తెలిపారు. తాను అనేకసార్లు భీమవరం రావాలని అనుకున్నా అవకాశం రాలేదని, అటువంటిది భీమవరంలో వాజ్ పేయ్ విగ్రహం(Vajpayee statue) ఆవిష్కరణలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. వాజ్ పేయ్‌ని స్పూర్తిగా తీసుకుని పని చేస్తున్నానని చెప్పారు. భీమవరానికి ప్రత్యేకత ఉందని, పట్టణంలో ఉండే సంపద ఉన్నా, పల్లెల్లో ఉండే ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఉన్నాయన్నారు.
‘‘ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం నేడు ప్రపంచంలో ఉన్నత దేశంగా కీర్తింపపడుతుంది. భారతీయుడు అంటే... తలెత్తుకుని సెల్యూట్ చేసే పరిస్థితి మన దేశానికి మోడీ కల్పించారు. మోడీ ఎంత కృషి చేసినా... ఆనాడు వాజ్ పేయ్ వేసిన పునాదే దీనికి నాందీ అయ్యింది. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుంటూ.. ప్రజలకు నిరంతరం సేవ చేయడమే రాజకీయం అని ఆచరించి చూపిన నేత వాజ్ పేయ్. కాంగ్రెస్ యేతర ప్రధానిగా ఐదేళ్లు పాలన చేసిన వ్యక్తి వాజ్ పేయ్. 1999లో నేషనల్ ఫ్రంట్ ద్వారా అనేక పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని నడిపారు. వాజ్ పేయ్ వేసిన పునాదే.. నేడు ప్రాంతీయ పార్టీలకు ఊపరి పోసింది. నేటి యువతరం కూడా వాజ్ పేయ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.’’ అని రామ్మోహన్ నాయుడు సూచించారు.
‘‘13 రోజులు ప్రధానిగా చేసినా.. ఆ తర్వాత ఒక్క ఓటుతో పదవి పోతుందని చెప్పినా.. విలువలుకు కట్టుబడి ఉన్నారు. నాకు అధికారం వద్దు.. ప్రజాస్వామ్యం గెలవాలని అని మాట్లాడిన వ్యక్తి వాజ్ పేయ్. నేటి రాజకీయాలతో చూడండి.. నేడు ఒక్క ఓటు కొనేందుకు కోట్లు కుమ్మరిస్తారు. ఎంపీలపై ఒత్తిడి తెచ్చి మద్దతు ఇచ్చేలా చేస్తారు. కానీ ఆనాడు వాజ్ పేయ్ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు. చిన్న వయసులోనే జైలుకు వెళ్లారు. ఎన్నో ఇబ్బందులు పడి అంచలంచెలుగా ఎదిగి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రధానిగా అవకాశం వచ్చింది.1999 -2004 మధ్య జాతీయ రహాదారుల నిర్మాణం ద్వారా రాష్ట్రాలను కలిపారు. నగరాల నుంచి పల్లెల వరకు రైతుల వరకు మహిళల వరకు రోడ్లు వేయాలని గ్రామీణ సడక్ యోజన తీసుకు వచ్చారు. ఆరోజుల్లో అణుబాంబ్ శక్తిగా కావాలనుకుంటే.. అగ్రదేశాలు ఒత్తిడి చేశాయి. కరుణామయుడు లాంటి వాజ్ పేయ్.. ఒక కవి.. ఆనాడు ప్రపంచం మొత్తం ఒత్తిడి తెచ్చినా.. ధైర్యంగా నిలబడి మా దేశానికి ఏం కావాలో అదే చేస్తామన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా.. అణుశక్తి దేశంగా భారతదేశాన్ని నిలిపారు.’’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.






