- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొందూరు ఖాదీ బ్రాండ్.. పూర్వ వైభవం వచ్చేలా.. పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి సమీక్ష
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తుత స్థితిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సంయుక్త కలెక్టర్ ఫార్మన్ అహ్మద్‌తో వర్చువల్ విధానంలో మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తుత స్థితిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సంయుక్త కలెక్టర్ ఫార్మన్ అహ్మద్‌తో వర్చువల్ విధానంలో మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పలాస-కాశీబుగ్గ ఆర్వోబీ, కేంద్రీయ విద్యాలయం నిర్మాణం,10 కోట్ల సీఎస్ఆర్ నిధులతో శ్రీకూర్మం ఆలయ అభివృద్ధి పనులు, మూల పేట పోర్టు, శ్రీకాకుళం నగరంలో పార్కుల నిర్మాణం, శ్రీకాకుళం నుంచి సముద్ర తీరానికి మరో కొత్త రహదారి, పొందూరు ఖాదీ బ్రాండ్ కి పూర్వ వైభవం వచ్చే విధంగా చేసే కార్యక్రమాల కార్యాచరణను, ప్రస్తుత స్థితిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారంతో అనేక కీలక ప్రాజెక్టులు ఈ ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విలువ, నాణ్యత విషయంలో రాజీ పడకుండా కార్యక్రమాలు సాగాలని, ప్రాజెక్టులకు నిర్దేశిత గడువు విధిస్తూ సమీక్షలో కీలక సూచనలు చేశారు.






