- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులమతాలకు అతీతమైన పార్టీ బీజేపీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
సీఎం జగన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్.. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో శాంతిభద్రతల వ్యవస్థ సరిగ్గా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేవలం ఇళ్ళ స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. ఏపీ నుండి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ప్రధాని మోడీ పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కులామతాలకు అతీతమైన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనారిటీ నారీమణులకు గొప్ప వరమని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు.






