- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ గాయని శ్రీలలితకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందనలు
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ, రాయనపాడులలో ఒక రోజు పర్యటన చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ, రాయనపాడులలో ఒక రోజు పర్యటన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిలతో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
అమరావతికి రైల్వే కనెక్టివిటీ
ప్రపంచంలో పూర్తిస్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందని, ఇది మోడీ ప్రభుత్వ ఘనత అని మంత్రి పేర్కొన్నారు. రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామని, ఇందుకోసం ప్రత్యేక రైల్వే లైన్ నిధులు సమకూర్చామని చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం హడ్కో (HUDCO) నుంచి రూ. 11,000 కోట్లు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ కలిసికట్టుగా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు మంత్రి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం నగరంలోని వాజ్‌పేయీ పార్కులో ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో పాల్గొని చెత్త ఊడ్చారు, అలాగే మొక్కలు నాటి స్థానిక వాకర్స్‌తో ముచ్చటించారు.
ప్రముఖ యువ గాయనికి అభినందనలు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన విజయవాడ పర్యటనలో భాగంగా ప్రముఖ యువ గాయని శ్రీలలితను ఆమె నివాసంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలన, విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. కర్ణాటక, హిందుస్తానీ సంగీత శైలులు రెండింటిలోనూ రాణించడం ఎంతో కష్టతరమని పేర్కొన్న మంత్రి.. ఈ రెండు భిన్నమైన సంగీత ప్రక్రియల్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్న శ్రీలలితను ప్రత్యేకంగా ప్రశంసించారు.






