లిక్కర్ కేసులో బిగ్ బాస్ అరెస్ట్‌ అప్పుడే: కేంద్రమంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-02 08:04:07  IST  )

లిక్కర్ కేసులో బిగ్ బాస్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు చేశారు..

లిక్కర్ కేసులో బిగ్ బాస్ అరెస్ట్‌ అప్పుడే: కేంద్రమంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో రాష్ట్రంలో పలు సంచనాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ SIT.. అసలు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు ఆధారాలు సైతం రాబట్టినట్లు సమాచారం. త్వరలోనే బిగ్ బాస్‌ను విచారించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం సంచలనంగా మారాయి.

తెలుగుదేశం(Telugu Desam Party) పార్టీ ఎమ్మెల్యే నుంచి ఎంపీలు, మిగిలిన నాయకులు సైతం త్వరలో బిగ్ బాస్‌(Big Boss)ను అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి సైతం పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో ఆధారాలు దొరకగానే బిగ్ బాస్‌ను అరెస్ట్ చేస్తారని తెలిపారు. విచారణలో అటు సిట్ కూడా పక్కా ఆధారాలను సేకరిస్తోందని పెమ్మసాని వెల్లడించారు. ఇక లిక్కర్ కేసులో ఎంపీని ఎవరూ అక్రమంగా అరెస్ట్ చేయలేరన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే వైసీపీ ఎంపీని అరెస్ట్ చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrashekar) స్పష్టం చేశారు.

Next Story