ఐక్యత, అభివృద్ధిని దెబ్బ తీసే కుట్ర: కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

దేశ ఐక్యత, అభివృద్ధిని దెబ్బ తీసేందుకే ఉగ్రవాదులు కుట్ర చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు..

ఐక్యత, అభివృద్ధిని దెబ్బ తీసే కుట్ర: కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ఐక్యత, అభివృద్ధిని దెబ్బ తీసేందుకే ఉగ్రవాదులు కుట్ర చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Central Minister Pemmasani Chandrasekhar) అన్నారు. గుంటూరు(Guntur)లో కూటమి నాయకులు నిర్వహించిన ‘తిరంగా ర్యాలీ’(Tiranga Rally)లో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత సైనికులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఒత్తిడిలోనూ ప్రధాని మోడీ అప్రమత్తంగా వ్యవహరించారని పెమ్మసాని పేర్కొన్నారు.

కాగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు కూటమి నాయకులు నజీర్, కోవెలమూడి రవీంద్ర, వల్లూరు జయ ప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత జవాన్లుకు మద్దతు తెలిపారు.

Next Story