కుటుంబంతో ప్రధానిని కలిసిన కేంద్రమంత్రి.. ఆ క్షణాలను మరువలేనంటూ పోస్ట్

by Naga Rani Yarlagadda |

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) సోమవారం తన కుటుంబ సభ్యులతో సహా ప్రధాని నరేంద్రమోడీ (PM Modi)ని కలిశారు.

కుటుంబంతో ప్రధానిని కలిసిన కేంద్రమంత్రి.. ఆ క్షణాలను మరువలేనంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) సోమవారం తన కుటుంబ సభ్యులతో సహా ప్రధాని నరేంద్రమోడీ (PM Modi)ని కలిశారు. అనంతరం ఆ మధుర క్షణాల గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధానిని కలిసిన ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన.. కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి క్షణాలు తనకెంతో అమూల్యమైనవని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తన విలువైన సమయాన్ని తమకు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని మోదీది దూరదృష్టితో కూడిన నాయకత్వం, అంకితభావం, వినయశీలతతో కూడిన వ్యక్తిత్వం తమనెంతో ప్రభావితం చేసిందని, ఈ మధురమైన క్షణాలు తమకెప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

Next Story