- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘NAKSHA’తో భూవివాదాలకు చెక్.. 10 ఏపీ మున్సిపాలిటీల్లో సర్వే
ఏపీలో NAKSHA కార్యక్రమాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడం, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు NAKSHA కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 152 మున్సిపాలిటీల్లో భూముల సర్వేకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌పై గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో శుక్రవారం జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ(Union Minister Pemmasani, Minister Narayana), కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 ద్వారా దేశాన్ని ప్రధాని మోడీ, స్వర్ణాంధ్ర 2047 ద్వారా ఏపీని సీఎం చంద్రబాబు పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పట్టణాల్లో పారదర్శక, సమర్థవంతమైన పాలన అందించేందుకు ‘‘నక్ష’’ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. ‘‘నక్ష’’ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఏపీలో 10 మున్సిపాలిటీలు కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. తద్వారా రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీల్లో 524 చ.కిమీ.విస్తీర్ణంలో ఉన్న 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నారని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో నిర్దేశిత గడువులోగా 10 మున్సిపాలిటీల్లో సర్వే పూర్తి చేసి రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయిందన్నారు. ఏలూరు, మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లలో ఏరియల్ సర్వే కొనసాగుతుందని చెప్పారు.
‘‘కుప్పం, ఒంగోలు, అనంతపురం, మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో 6000 ప్రభుత్వ ఆస్తుల రీసర్వే కూడా పూర్తయింది. క్షేత్రస్థాయి సర్వేకు అవసరమైన 166 రోవర్ల లో 158 రోవర్లు సిద్ధంగా ఉన్నాయి. సర్వే కోసం క్షేత్ర స్థాయిలో అవసరమైన 643 వెరిఫికేషన్ బృందాలను సిద్ధం చేశాం. ‘‘నక్ష’’ కార్యక్రమం పూర్తయితే పట్టణాలకు సరైన ప్రణాళిక,పన్నుల విధింపుతో పాటు ఆస్తుల వివాదాలకు చెక్ పెట్టవచ్చు. కేంద్రంతో కలిసి భూముల సర్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విజయవంతంగా నక్ష కార్యక్రమం పూర్తి చేస్తాం.’’ అని నారాయణ స్పష్టం చేశారు.






