- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిద్దె తోటల పెంపకం గురించి నాకు తెలియదు : కేంద్రమంత్రి పెమ్మసాని
గుంటూరులో పురుగు మందులు లేకుండా మిద్దెతోటలను సాగుచేస్తున్న మహిళలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక యుగంలో కూరగాయలు, ఆకుకూరల వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంది. అనేకమంది మిద్దెతోటల ద్వారా పంటలను సాగుచేసి, ఆదాయం పొందుతున్నారు. గుంటూరులో పురుగు మందులు లేకుండా మిద్దెతోటలను సాగుచేస్తున్న మహిళలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ పదవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వార్షికోత్సవానికి వచ్చేంతవరకూ మిద్దెతోటల సమూహం ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. పురుగుల మందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేస్తే.. ఆదాయం వస్తుందన్నారు. మార్కెట్ డిమాండ్ పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని సూచించారు. కేవలం వ్యవసాయంతోనే సరిపెట్టకుండా.. ఆహార ఉత్పత్తుల్ని కూడా తయారు చేస్తుండటాన్ని మెచ్చుకున్నారు. రైతులు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని, మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపై కూడా ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు.






